Magazines

అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ఘన సన్మానం

1 గంట క్రితం

A grand tribute
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు రూరల్‌
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా మంగళవారం ఆలేరు మండలంలోని అంగన్వాడీ టీచర్లు,ఆశా వర్కర్లను ఘనంగా సన్మానించారు.మండల పార్టీ అధ్యక్షుడు పూజారి కుమారస్వామి గౌడ్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కుమ్మరిండ్ల లక్ష్మి,మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు శేషత్వం అర్చన ఆధ్వర్యంలో టంగుటూరు,సాయిగూడెం,మదనపల్లి,కొల్లూరు, శారాజీపేట గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో గర్భిణులు,బాలింతలు,చిన్నారులకు సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు,ఆశా వర్కర్లను శాలువాలతో సత్కరించారు.చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు.అక్టోబర్‌ 17 వరకు కొనసాగనున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు జాలపు మమత,పిన్నింటి భాగ్య,భూపెల్లి సంతోష,బి. అండాలు,. రాజమణి,కోటగిరి బాల నరసమ్మ,ఎండీ పర్వీన్,ఎలిజబెత్,ఎల్లా పద్మ,ఆశా వర్కర్లు జి. విజయ,బి.లక్ష్మి,గ్యాదపాక లక్ష్మిని సన్మానించారు.కార్యక్రమంలో కటికే వెంకటేష్, ఎస్. అమరేందర్,కళ్లెం యాదగిరి,కాండ్రాజు శ్రీనివాస్, బైరి మహేంద్ర, మంత్రి సాయి ప్రసాద్‌తో పాటు ఆయా గ్రామాల బూత్‌ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్