Magazines

బ్యాంకింగ్ లావాదేవీల్లో అప్రమత్తత అవసరం

1 గంట క్రితం

Banking
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్ 

నవతెలంగాణ - మల్హర్ రావు

బ్యాంకింగ్ లావాదేవీలు, డిజిటల్ చెల్లింపుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్  సూచించారు. గురువారం తాడిచెర్ల గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ లోన్ యాప్‌లు, లాటరీలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, పాన్ కార్డు అప్‌డేట్, ఆధార్ కార్డు లింకేజీ పేరుతో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్‌లను నమ్మవద్దని సూచించారు. ఓటీపీలు, ఏటీఎం పిన్‌లు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ వెల్లడించవద్దన్నారు. గూగుల్‌లో లోన్ యాప్‌ల కోసం వెతకడం చేయవద్దని, సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే అంశాలను ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.


డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించే సమయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బ్యాంకు ఖాతాదారులు తమ కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు సమర్పించాలని కోరారు. రైతుల వ్యవసాయ అవసరాల కోసం పంట రుణాలు అందించేందుకు బ్యాంకు ఎల్లప్పుడూ ముందుంటుందని, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకు రూ.436, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు రూ.20 చెల్లించి బీమా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ముందుగా బుర్ర కథ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి, సింగిల్ విండో వైస్ చైర్మన్ మల్క ప్రకాష్, కేడీసీసీ అసిస్టెంట్ మేనేజర్ సదయ్య, సంఘ కార్యదర్శి సంతోష్, బ్యాంకు సిబ్బంది, సహకార సంఘం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్