Magazines

రోడ్లు హీనం.. ఒళ్లు హూనం

49 నిమిషాల క్రితం

road
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మల్హర్ రావు

మండల పరిధిలోని తాడిచెర్ల నుంచి మల్లారం మీదుగా కొయ్యుర్ నాగులమ్మ వరకు, కిషన్ రావు పల్లి నుంచి అటవీప్రాంతం మీదుగా భూపాలపల్లి 1 ఇంక్లెయిన్ వరకు రహదారులు అడుగడునా గుంతలమయమై ప్రజలు, ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. రహదారులు గుంతలు పడి అధ్వానంగా మారాయని సంబంధించిన అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. పారెస్ట్ లో నూతనంగా చేపట్టిన మట్టిరోడ్డు అడుగడుగునా గుంతమయంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులకు గురివుతున్నారు. గుత్తేదారు ఇప్పటికైనా పనుల్లో వేగం పెంచి కంకర,తారు వేయాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్