Magazines

‘నిమ్స్‌’లో నోరీ అక్రమాల చిట్టా

54 నిమిషాల క్రితం

NIMS
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
ఉద్యోగుల ఇండ్లల్లో అధికారుల తనిఖీలు

నవతెలంగాణ-సిటీబ్యూరో ​
హైదరాబాద్‌లోని నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్/అదనపు ప్రొఫెసర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన అక్రమ ఆస్తుల కేసులో భాగంగా సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. లక్ష్మీ భాస్కర్‌ అనుమానిత బినామీలు, పలువురు నిమ్స్‌ ఉద్యోగుల ఇండ్లల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని 5 వేర్వేరు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. నిందిత అధికారికి ఆర్థిక, ఇతర లావాదేవీలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమానిత బినామీల నివాసాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ సమయంలో అనుమానిత బినామీ ఆస్తులకు సంబంధించిన అనేక పత్రాలు, ఇతర సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిమ్స్ ఉద్యోగి అయిన ధన్‌రాజ్ ఇంట్లో రూ.4,94,394 స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిమ్స్ అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగి డి.గణేష్, ఇతరుల పేర్లపై ఉన్న ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా లభించాయి. వీటిలో మహేశ్వరంలో సుమారు రూ.57 లక్షల విలువైన 3 వ్యవసాయ భూమి ప్లాట్లు, బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న వెంకటేశ్వర కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో రూ.2,70,00,000 విలువైన ఒక ఓపెన్ ప్లాట్, రూ.20,00,000 విలువైన రెండు పెట్టుబడులు ఉన్నాయి. వీటితోపాటు రూ.3,00,000 చేతి అప్పుకు సంబంధించిన రశీదులు కూడా ఈ తనిఖీల్లో లభించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్