నవతెలంగాణ - హైదరాబాద్ : ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 365.2 కిలోల గంజాయిని కొత్తగూడెం డీటీఎఫ్, ఎక్సైజ్ బృందాలు పట్టుకున్నాయి. బైక్‌పై 9 కిలోలు, హ్యుందాయ్ కారులో 100 కిలోలు, కరుణగిరి సమీపంలోని లారీలో 263.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన దివాకర్ మండల్ (22), సుమన్ పాల్ (22), రాజశేఖర్ మార్గి (22), బ్రిజన్ నాసా (20)ను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన బైక్, కారు, లారీని సీజ్ చేశారు.







కామెంట్‌లు (0)