నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఒనెనెస్ ఉద్యమ స్థాపకుడైన కల్కి భగవాన్ (77) మహాసమాధి చెందారు. గత పది రోజులుగా చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన, మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటలకు తుదిశ్వాస విడిచారని ట్రస్టు వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఆయన అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. ఆయన భౌతికకాయాన్ని బుధవారం ఉదయం 11 గంటలకు తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలంలోని బత్తులవల్లంలో ఉన్న ఏకం క్షేత్రానికి (గోల్డెన్ సిటీ) తరలించనున్నారు.







కామెంట్‌లు (0)