నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని పోతంగల్ కాలన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కంప్యూటర్ విద్యను అభ్యసించడానికి 6 కంప్యూటర్లు సమకూర్చి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుచేసిన అమాస గురు చరణ్ రెడ్డికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు నేడు పాఠశాలలో సన్మానం చేశారు.
ఈ సందర్భంగా దాత గురు చరణ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఈ కంప్యూటర్ ల్యాబ్ ఉపయోగించుకొని సాంకేతిక నైపుణ్యం అందిపుచ్చుకొని కొత్త కొత్త విషయాలను నేర్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తల్లిదండ్రులకు మన పోతంగల్ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ప్రధానోపాధ్యాయులు గన్నమనేని రంగారావు మాట్లాడుతూ.. యువ పారిశ్రామికవేత్త గురు చరణ్ రెడ్డి గారు మంచి మనసుతో విద్యార్థులు కంప్యూటర్ ద్వారా శాస్త్ర సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలని కంప్యూటర్ ల్యాబ్ సమకూర్చినందుకు, అదేవిధంగా వీరు గతంలో ప్రొజెక్టర్, కంప్యూటర్, ప్రింటర్ సమకూర్చి పాఠశాల మౌలిక వసతులు మెరుగుపరచడంలో ఇతోధికంగా సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారుఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రదీప్, సత్యనారాయణ, రవికుమార్, గంగాధర్, దేవిక రాణి, రామకృష్ణ ,రాజ్ కుమార్, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.



