నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలో పిఎస్ పాఠశాలలో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు, మండలంలోని ఎల్ఏఫ్ఎల్ హెచ్ఎం లకు మంగళవారం నుండి రెండో విడత ఉపాధ్యాయ శిక్షణ నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి నాణ్యతను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. బోధనా పద్ధతులు సాంకేతిక పరిజ్ఞానం ఇతర నైపుణ్యాలు మెరుగుపరిచే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు విద్యాబోధనను పటిష్టం చేయడమే కాకుండా నూతన బోధనా పద్ధతులను జోడించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించే నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ శిక్షణలు ఉపయోగపడతాయన్నారు. ఉపాధ్యాయులు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలో పనిచేసే ఎస్జీటీ ఉపాధ్యాయులు, ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం లు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు శిక్షణను ఉపయోగించుకోవాలి: ఎంఈఓ రేగ కేశవరావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES