Thursday, October 2, 2025
E-PAPER
HomeఆటలుIND vs WI : తొలి రోజు ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిఇండియా

IND vs WI : తొలి రోజు ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిఇండియా

- Advertisement -

నవతెలంగాణ ఢిల్లీ:

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమ్‌ఇండియా,వెస్టిండీస్‌ జట్టు మొదటి టెస్ట్‌లో తలపడుతున్నాయి. తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ బ్యాటింగ్‌లో విఫలమైంది. 44.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసింది. మరో 42 పరుగులు చేస్తే విజయం వరించనుంది. మొత్తానికి తొలి రోజు టీమిఇండియా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 

యశస్వి జైస్వాల్‌ (36; 54 బంతుల్లో, 7 ఫోర్లు) తనకు లభించిన ఆరంభాన్ని పెద్ద స్కోర్‌గా మలచలేకపోయాడు. సాయి సుదర్శన్‌ (7; 19 బంతుల్లో) విఫలమయ్యాడు. కేఎల్‌ రాహుల్‌ అర్థశతకం చేశాడు. టెస్టుల్లో అతడికిది 20వ హాఫ్‌సెంచరీ. ఆట ముగిసే సమయానికి కేఎల్‌ రాహుల్‌ (53; 114 బంతుల్లో, 6 ఫోర్లు) , శుభ్‌మన్‌ గిల్‌ (18, 42 బంతుల్లో, 1 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్‌ బౌలర్లలో జైడన్‌ సీల్స్‌, రోస్టన్‌ చేజ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -