నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియన్ క్రికెట్ టీం ఒడిషాలోని పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించింది. వారితో పాటు టీం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, పలువురు క్రికెటర్లు వారి కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. క్రికెటర్ల రాక సందర్భంగా ఆలయాధికారులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఇండియా వేదిక భారత్, దక్షణాఫ్రికా మధ్య టెస్ట్, వన్డే సిరీస్ మ్యాచ్‌లు జరిగిన విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్(2-0)ను సఫారీ జట్టు కైవసం చేసుకోగా, వన్డే ట్రోఫి(2-1)ని టీమిండియా గెలుచుకుంది. అదే విధంగా రెండు జట్ల మధ్య ఐదు T20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇవాళ తొలి T20 మ్యాచ్ కటక్ వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. సాయంత్రం ఆరు గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించిన టీమిండియా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



