Sunday, March 8, 2026
E-PAPER
Homeఆటలుటీమ్‌ఇండియా వుమెన్స్‌ ఘోర పరాభవం

టీమ్‌ఇండియా వుమెన్స్‌ ఘోర పరాభవం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పెర్త్ వేదికగా జరిగిన ఏకైన పింక్ బాల్ టెస్ట్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా వుమెన్స్‌పై ఆస్ట్రేలియా మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 25 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టు 4.3 ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండానే 28 పరుగులు సాధించింది. జార్జియా (16), లిచ్‌ఫీల్డ్‌ (11) నాటౌట్‌గా నిలిచారు. అంతకు ముందు.. 105/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియా 149 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ముందు 24 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రతీకా రావల్‌ (63) ఒంటరి పోరాటం చేసింది. స్నేహ్‌ రాణా (30) ఫర్వాలేదనిపించింది. రెండో ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన (2), షెఫాలీ వర్మ (5), జెమీ రోడ్రిగ్స్‌ (14), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (11), దీప్తి శర్మ (9), రిచా ఘోష్‌ (0), కాశ్వీ గౌతమ్ (0) ఇలా అందరూ విఫలమయ్యారు. క్రాంతి గౌడ్‌ (0) నాటౌట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హామిల్టన్‌ 3, అన్నాబెల్‌, అలానా కింగ్‌, గార్డ్‌నర్‌ తలో రెండు, డార్సీ బ్రౌన్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేస్తే.. ఆసీస్‌ 323 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -