నవతెలంగాణ – హైదరాబాద్ :
ఆసియా కప్ 2025 లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్ లో చివరలో పాకిస్తాన్ మెరిసింది. మొదట తడబడిన పాకిస్థాన్… షాహీన్ అఫ్రిది కారణంగా గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. ఈ తరుణంలోనే.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. అంటే టీమిండియా ముందు 128 పరుగుల టార్గెట్ ఉంచింది పాకిస్తాన్. ఆ లక్ష్యాన్ని నిర్నిత 20 ఓవర్లలో టీమిండియా చేదించాల్సి ఉంటుంది.
దుమ్ము లేపిన భారత బౌలర్లు: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ దుబాయిలో జరుగగా… ఇందులో భారత బౌలర్లు రెచ్చిపోయారు. ఫాస్ట్ అలాగే స్పిన్ బౌలర్లు అదరగొట్టడంతో పాకిస్తాన్ తక్కువ పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీయగా… బుమ్రా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. మరోసారి కుల్దీప్ యాదవ్ రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో పాకిస్తాన్.. కుదేలు అయింది. అయితే మ్యాచ్ చివరలో వచ్చిన షాహిన్ అఫ్రిది… 16 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లు ఉండడం గమనార్హం. 200 కు పైగా స్ట్రైక్ రేట్ తో విరుచుకుపడ్డాడు. దీంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది పాకిస్తాన్