- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు అంతిమసంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, కళాకారులు, అభిమానులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు ఫిల్మ్‌నగర్‌లోని కోట శ్రీనివాసరావు నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే.
- Advertisement -