Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిక'న్నీళ్లు'..

క’న్నీళ్లు’..

- Advertisement -

తరువుల తలలు తెగేకొద్దీ
కాలుష్యం విజయధరహాసం చేస్తుంది!
అమృతమల్లే జాలువారుతున్నా
భూగర్భజలాలను బతికించలేక
జోరువాన భోరుమంటోంది..
మన చేష్టలకు పగబట్టిన భానుడి
భగభగలకు ఊరూరికి ఊరని నీరే
ఉరై బిగుసుకుంటోంది..
భూమండలమంతా తిరిగినా
స్వేదజలంతో తడవడం తప్ప గొంతు
తడుపుకొనే స్వచ్ఛజలం దుర్లభమవుతోంది..

రానురానూ కన్నీరు మిగిల్చి
మాయమౌతున్న నీరు
మన నిర్లక్ష్యాలకు నిలువెత్తు
దర్పణమౌతున్న తీరు
నేలను పాతాళానికి పెకిలిస్తుంటే
నిర్ధయగా తవ్వి
పాపం నిరాశగా
పెదవి విరుస్తోంది నవ్వి
మనిషి దురాశంత
సముద్రాలుండి ఏం లాభం?
దాహార్తి తీర్చే మానవత్వమంటి చెరువులు
చెలమలే మనకు శరణ్యం

రేపటి కోసం నీటిని భద్రపరచకపోతే
చుక్కనీరు కోసం దార్లు తెలీని ఎడారుల్లో
సూరీడి వేసంగి చూపుల్లోంచి తప్పించుకోలేక
వంట్లో నీరంతా అడియాశలా జావగారి
ఎండమావులు కంటినీటిలో కలిసిపోయి
తరగని దూరాలనే
మన తలరాతగా మారుస్తాయి
అప్పుడు మిగిలేది మనుష్యుల్లేని
నెర్రలెండిన నేలలే!

– భీమవరపు పురుషోత్తమ్‌
9949800253

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad