నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల పలు విమానాల్లో సాంకేతిక లోపాలతో హడలెత్తిస్తున్నాయి. విమానాలు ఎక్కాంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఇండిగో విమానంలో సమస్య తలెత్తటంతో పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ () రాష్ట్రంలోని ఇండోర్ దేవీ అహల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయం నుంచి మంగళవారం ఉదయం 6.30కి రాయ్‌పూర్ కు ఇండిగో విమానం బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కాసేపటికే 6.54 విమానం తిరిగొచ్చి ల్యాండయ్యింది. విమానంలో సాంకేతిక లోపానికి సంకేతంగా అలారమ్ మోగింది. అప్పటికే విమానం సగానికిపైగా ప్రయాణం పూర్తి చేసుకుంది. అయినా పైలట్ ప్రయాణికుల సేఫ్టీ కోసం విమానాన్ని వెనక్కి మళ్లించాడు. తిరిగి ఇండోర్ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. అనంతరం ఇండిగో యాజమాన్యం ఫ్లైట్‌ను రద్దుచేసింది. ప్రయాణికుల టికెట్ ఛార్జీలను రీఫండ్ చేసింది. అయితే, విమానాన్ని ఇంజినీర్‌లు తనిఖీ చేయగా ఏ లోపం లేదని, టెక్నికల్ ఇష్యూవల్ల ఫాల్స్ అలారమ్ మోగినట్లు నిర్ధారించారు.
ఇండిగో విమానాలో సాంకేతిక లోపం..అత్యవసరంగా ల్యాండింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES