- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమృత్‌సర్ – బర్మింగ్‌హామ్ మధ్య నడుస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ117లో సాంకేతిక లోపం తలెత్తింది. ల్యాండింగ్ సమయంలో రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) తెరుచుకుంది. విమానం ప్రధాన పవర్, హైడ్రాలిక్ వ్యవస్థలు పనిచేయకపోతే RAT అనేది యాక్టివేట్ చేసే భద్రతా పరికరం. సమయంలో అన్ని వ్యవస్థలు సాధారణంగానే పని చేయగా బర్మింగ్‌హామ్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన విమానాన్ని రద్దు చేశారు.
- Advertisement -