- Advertisement -
నవతెలంగాణ – హైదాబాద్ : వరుస విమాన ప్రమాదాలు, సాంకేతిక లోపాలు ప్రయాణికుల్లో దడ పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతి బయలుదేరాల్సిన అలియన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ తరువాత సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో ఫ్లైట్‌లో 65 మంది ప్రయాణికులు ఉన్నారు.
- Advertisement -