- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగేందుకు అనుకూలించలేదు. దీంతో విమానాశ్రయ కార్యకలాపాలను సుమారు 20 నిమిషాల పాటు నిలిపివేశారు. విమానం గంటకు పైగా గాల్లోనే చక్కర్లు కొట్టి, అనంతరం పరిస్థితులు చక్కబడటంతో సురక్షితంగా ల్యాండ్ అయింది.
- Advertisement -



