నవతెలంగాణ-ముధోల్ : ముధోల్ మండలంలోని వడ్తల్ వాగు పొంగి ప్రవహించడంతో లో లెవెల్ వంతెన పై వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది . దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఏ విషయం తెలుసుకున్న తహసిల్దార్ శ్రీలత వడ్తల్ వాగును గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. పలు వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ముధోల్ నుండి అబ్దుల్లాపూర్ వయా లోకేశ్వరం వెళ్లే వాహనదారులు ఈ రోడ్డు కుండా ప్రయాణించవద్దని తహశీల్దార్ సూచించారు. ఇతర రోడ్డు మార్గాలను ఎంచుకోవాలని కోరారు.అలాగే వర్షంతో మండలంలోని బోరిగాం గ్రామంలో తడిసిన, కూలిన ఇండ్లను తహశీల్దార్ పరిశీలించారు. ప్రభుత్వ పరంగా వచ్చే ఆర్థిక సాయాన్ని అందజేస్తామన్నారు. ఈమే వెంట నాయబ్ తహశీల్దార్ తెలంగ్ రావ్,ఆర్ఐ నారాయణ రావు పటేల్, తదితరులు ఉన్నారు.
వడ్తల్ వాగును పరిశీలించిన తహసిల్దార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES