నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ విరుచుకుపడ్డారు. ఇటీవల ఇంటర్వ్యూలో హోంమంత్రి అమిత్ షా.. బీహార్‌లో పారిశ్రామికాభివృద్ధికి.. భూమి కొరతే ప్రధాన అడ్డంకిగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన న్యూస్ నెట్‌వర్క్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిధమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అమిత్‌షా వ్యాఖ్యలపై తేజస్వి స్పందించారు. 20 సంవత్సరాలు బీహార్‌లో ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత కూడా హోంమంత్రి సాకులు చెబుతున్నారు. గుజరాత్‌లో మాత్రమే కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఆ కంపెనీల్లో పనిచేసే కార్మికులు మాత్రం బీహార్‌కు చెందినవారు. బీహారీలు ఇకపై మోసపోకండి అని తేజస్వి యాదవ్ ఆ రాష్ట్ర ప్రజలకు సూచించారు.
అమిత్‌షాకు తేజస్వియాదవ్ కౌంటర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES