Saturday, November 1, 2025
E-PAPER
Homeజాతీయంఈసీపై తేజ‌స్వీయాద‌వ్ ఫైర్

ఈసీపై తేజ‌స్వీయాద‌వ్ ఫైర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బిహార్ ఎన్నికల ప్రచారంలో హింసాకాండ చోటుచేసుకుంది. మోకామా అసెంబ్లీ నియోజకవర్గంలో జన్ సురాజ్ పార్టీ కార్యకర్త ఒకరు హత్యకు గురికావడంపై ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీనిపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. 40 వాహనాల కాన్వాయ్ ఆయుధాలతో ఎలా వెళ్లిందనేది తమకు ఆశ్చర్యంగా ఉందని, ఈసీ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోంది? ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? గూండాలను రక్షిస్తున్నదెవరు? అని నిలదీశారు.

బిహార్‌లో ఎన్నికల ప్రచారం తారాస్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో మోకామా ఏరియాలో గురువారంనాడు అనుమానాస్పద స్థితిలో జన్‌ సురాజ్ పార్టీ కార్యకర్త దులార్ చంద్ యాదవ్ మృతదేహం కనిపించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణల్లో కాల్పుల కారణంగానే దులార్ చంద్ మరణించినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి తరఫున దులార్ చంద్ ప్రచారం పాల్గొన్నాడని, అతని మృతదేహాన్ని పోలీసులకు అప్పగించకపోవడంతో కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని పాట్నా ఎస్ఎస్‌పీ కార్తికేయ కె శర్మ తెలిపారు.

కాగా, తాజా ఘటనపై జన్‌ సురాజ్ పార్టీ ఆవేదన వ్యక్తం చేశారు. సుపరిపాలన అని చెప్పుకుంటూ జంగల్ రాజ్‌కు వ్యతిరేకంగా ఓట్లు అడుగుతున్న వ్యక్తుల తరఫునే ఇవన్నీ చోటుచేసుకుంటున్నాయని విమర్శించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -