నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డేయే కూటమి మానిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్డేయే మానిఫెస్టోపై మహగఠ్‌బందన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ సెటైర్లు వేశారు. సంకల్ప పత్ర్ కాదు సారీ పత్ర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ ప్రజలకు క్షమాపణ చెపుతూ ఎన్డీయే కూటమి ఓ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నితిష్ ప్రభుత్వం అమలు చేయాలేదని మండిపడ్డారు. ఆ హామీలు అమలు చేయకుండానే కొత్త బూటకపు ఎజెండాను విడుదల చేశారని ఆయన విమర్శించారు. బీజేపీ విడుదల చేసిన మానిఫెస్టోలో ఏం రాసిందో కూడా నితిష్ కుమార్ తెలిసి ఉండదని, కనీసం ఆ పత్రంపై అవగాహన కూడా లేదని విమర్శలు గుప్పించారు. ఎన్డేయే పాలనలో బీహారీలకు చేసింది ఏమిలేదని, ప్రజలకు క్షమాపణ చెప్పుతూ సారీ పత్ర్ విడుదల చేయాలన్నారు.
నితిష్ పాలనలో బీహార్ లో పరిశ్రమలు లేవు, పెట్టుబడులు రాలేవని ఆయన మీడియా సమావేశంలో ఆరోపించారు. దేశంలోనే పేద రాష్ట్రంగా బీహార్ పేరుపొందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డేయే భాగస్వామి నితిష్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. గత పదేండ్లుగా ఫేక్ హామీలతో ప్రజలను ఎన్డేయే మోసం చేస్తుందని తేజస్వీ యాదవ్ అన్నారు.

 
                                    