Tuesday, November 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ క్యాబినెట్ భేటీ ప్రారంభం..

తెలంగాణ క్యాబినెట్ భేటీ ప్రారంభం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని ఆరో అంతస్తులో 12.15కు క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ కె.రామకృష్ణారావు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలు ప్రధాన అజెండా ఉన్నాయి. రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదేవధంగా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై డిస్కస్ చేయనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2025 నిర్వహణపై విస్తృతంగా చర్చ జరగనుంది. చివరగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ.. ఎన్నికల సంఘం సన్నద్ధతపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -