Wednesday, October 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలురేపు తెలంగాణ క్యాబినెట్ ..స్థానిక ఎన్నికలపై నిర్ణయం!

రేపు తెలంగాణ క్యాబినెట్ ..స్థానిక ఎన్నికలపై నిర్ణయం!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ క్యాబినెట్ మంత్రులు రేపు మరోసారి సమావేశం కానున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ కానుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలపై అధికారుల కమిటీ నివేదికపై మంత్రివర్గం చర్చించనుందని సమాచారం. అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న గందరగోళానికి తెరపడుతుందని అంతా భావిస్తున్నారు. పాత పద్ధతిలోనే ఎలక్షన్ కు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తుండగా.. ఈ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసే ఆర్డినెన్స్‌కు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు, SLBC పునరుద్ధరణ, SRSP రెండో దశ పనులపైన కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. అలాగే రైతు భరోసా స్కీమ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -