నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన EAPCET ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ (JNTUH) ఆధ్వర్యంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా తెలంగాణలోని వివిధ యూనివర్శిటీలు, ప్రైవేటు కళాశాలల్లో BE, B Tech, B Pharm, Pharm D, BSc (Hons) Agriculture, BFSc, BVSc వంటి అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందనున్నారు. విద్యార్థుల రిజిస్టర్ మొబైల్ నెంబర్లకు నేరుగా ఫలితాలను పంపనున్నారు. మరికాసేపట్లో విద్యర్థులకు నేరుగా ఈ ఫలితాలు వెళ్లనున్నాయి. లేదా అధికారిక వెబ్ సైట్ https://eapcet.tgche.ac.in/TGEAPCET/EAPCET_GetResult. పై క్లిక్ చేసి ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES