Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఘనంగా వాషింగ్టన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా వాషింగ్టన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – వాషింగ్టన్: వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం కళల కాంతులతో మెరిసిపోయింది. ఈ వేడుకలు స్థానిక ప్రవాస తెలంగాణ వాసుల్లో దేశభక్తిని, తెలంగాణ పట్ల అభిమానాన్ని చాటారు. వేడుకల్లో ముఖ్యాకర్షణగా నిలిచింది కలర్ ఫుల్ క్రియేషన్స్ అధినేత్రి కామసాని అనీలా ప్రదర్శించిన రాణీ రుద్రమ వేషధారణ. నేతన్న కళాకారులకు అండగా రూపొందించిన ప్రత్యేక డిజైన్లతో చేసిన ఫ్యాషన్ వాక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ – “రాయలసీమ బిడ్డ అయిన అనీలా తెలంగాణ కోడలిగా మా సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడేలా రుద్రమదేవి వేషధారణలో చేసిన ప్రదర్శన అత్యంత ప్రశంసనీయం,” అని కొనియాడారు. అలాగే సుప్రియ బండి మరియు అనీలా కామసానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ ఎల్. రమణ, వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్ బృందాల, ఇతర అసోసియేషన్ సభ్యులు, ప్రవాస భారతీయులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధి, సంస్కృతి, స్వాభిమానాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా ఈ వేడుకలు ప్రదర్శించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad