Sunday, June 15, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువైభవంగా తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం

వైభవంగా తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్‌ తెలంగాణ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు, టీఎఫ్‌డీఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.హరీష్‌ జ్యోతి ప్రజ్వలనతో ఈ వేడుకను ఆరంభించారు. అనంతరం ఈ అవార్డుల వేడుకకు సంబంధించిన సావనీర్‌ను లాంచ్‌ చేశారు.
అలాగే సీీనియర్‌ జర్నలిస్ట్‌, రచయిత పొన్నం రవిచంద్ర, రమావత్‌ నాగుల నాయక్‌ (గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ రూపకర్త), ‘చదువ ుకోవాలి’ చిత్ర నిర్మాత వెంకటేశ్వరరావును శాలువా, సిల్వర్‌ అవార్డుతో ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సత్కరించారు. అలాగే విజేతలకు రూ.5లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా అందజేశారు. 14 సంవత్సరాలకు సంబంధించిన ఉత్తమ సినిమాలను, నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసిన జ్యూరీ కమిటీ చైర్మన్‌ మురళీమోహన్‌తోపాటు జ్యూరీ సభ్యులకు గోల్డెన్‌ అవార్డులను బహూకరించారు.
అలాగే 2014 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల కమిటీ చైర్మన్‌ జయసుధతోపాటు జ్యూరీ సభ్యులకు కూడా గోల్డెన్‌ అవార్డులను ప్రదానం చేశారు.
గద్దర్‌ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో గద్దర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ సూర్యకిరణ్‌ గద్దర్‌కు రూ.3 కోట్ల రూపాయలను రాష్ట్రప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందజేశారు.
‘పుష్ప2’ చిత్రానికిగాను ఉత్తమ నటుడు అవార్డుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్న అల్లుఅర్జున్‌ మాట్లాడుతూ, ‘పుష్ప2′ అందుకున్న తొలి అవార్డు ఇది. మా దర్శకుడు సుకుమార్‌ వల్లే ఇది సాధ్యమైంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును నా అభిమానులకు అంకితం చేస్తున్నాను’ అని తెలిపారు. ఎన్టీఆర్‌ జాతీయ అవార్డును అందుకున్న నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ‘గద్దర్‌ని గౌరవించి ఇలాంటి అవార్డులను ఇవ్వడం అభినందనీయం. నాన్న ఎన్టీఆర్‌ పేరు మీద నాకు అవార్డును లభించడం ఆనందంగా ఉంది. ఆ తండ్రికి కొడుకుగా ఇది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను’ అని అన్నారు.

పరిశ్రమను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవించి, అవసర మైన అన్ని వసతులను ఏర్పాటు చేసింది. అలాగే ప్రతిభను ప్రోత్సహించింది. 60 ఏళ్ళ క్రితం నంది అవార్డులను ఇచ్చింది కూడా మా ప్రభుత్వమే. గతంలో భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్‌ అనుకునేవారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ, హైదరాబాద్‌ వేదిక అని చెప్పుకుంటున్నారు. పాలనా పరంగా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది. కానీ పరిశ్రమను, మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. బాలీవుడ్‌, హాలీవుడ్‌ అని కాదు.. చిత్ర పరిశ్రమకి హైదరాబాద్‌ అడ్డాగా, అంతర్జాతీయంగా చెప్పుకునేలా ఉండాలి. అలా ఉండేలా పరిశ్రమ కృషి చేయాలి. దీనికి అవసరమైన అన్నీ మేం సమకూరుస్తాం. తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌కి తగ్గట్టు తెలుగు చిత్ర పరిశ్రమ కూడా సాప్ట్‌వేర్‌, ఫార్మా కంపెనీల మాదిరిగా గొప్ప పరిశ్రమగా నిలబెట్టాలనేది మా లక్ష్యం. అలాగే 2047 విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేస్తున్నాం. అందులో ఒక డాక్యుమెంట్‌ సినిమా పరిశ్రమకి సంబంధించి కూడా ఉంది. తెలుగు పరిశ్రమను అభివృద్ధి పథంలోకి తీసుకెద్దాం. – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ప్రత్యేక అవార్డులు
ఎన్టీఆర్‌ జాతీయ ఫిల్మ్‌ అవార్డు : బాలకృష్ణ
పైడి జయరాజ్‌ ఫిల్మ్‌ అవార్డు : మణిరత్నం
బీఎన్‌ రెడ్డి ఫిల్మ్‌ అవార్డు : సుకుమార్‌
నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్‌ అవార్డు : అట్లూరి పూర్ణచంద్రరావు
కాంతారావు ఫిల్మ్‌ అవార్డు : విజయ్‌ దేవరకొండ
రఘపతి వెంకయ్య ఫిల్మ్‌ అవార్డు : యండమూరి వీరేంద్రనాథ్‌

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌ -2024 విజేతల వివరాలు
ఉత్తమ చిత్రం – కల్కి
ఉత్తమ రెండో చిత్రం – పొట్టేల్‌
ఉత్తమ మూడో చిత్రం – లక్కీభాస్కర్‌
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్‌ (పుష్ప-2)
ఉత్తమ నటి – నివేదా థామస్‌ (35 చిన్న కథకాదు)
ఉత్తమ డైరెక్టర్‌ – నాగ్‌ అశ్విన్‌ (కల్కి)
ఉత్తమ సహాయ నటుడు – ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి –
శరణ్య ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్‌)
ఉత్తమ హాస్యనటుడు – సత్య, వెన్నెల కిషోర్‌ (మత్తు వదలరా)
ఉత్తమ సంగీత దర్శకుడు – బీమ్స్‌ (రజాకార్‌)
ఉత్తమ స్టోరీ రైటర్‌ – శివ పాలడుగు
ఉత్తమ స్క్రీన్‌ ప్లే – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)
ఉత్తమ గాయకుడు – సిద్ద్‌ శ్రీరామ్‌ (ఊరుపేరు భైరవకోన)
ఉత్తమ గాయని – శ్రేయా ఘోషల్‌ (పుష్ప-2)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – గణేష్‌ ఆచార్య (దేవర)
స్పెషల్‌ జ్యూరీ అవార్డు – దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీభాస్కర్‌)
స్పెషల్‌ జ్యూరీ అవార్డు – అనన్య నాగళ్ల (పొట్టేల్‌)
బెస్ట్‌ డెబ్యూ ఫిల్మ్‌ డైరెక్టర్‌ – యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)
2024 ఉత్తమ బాలల చిత్రం – 35 చిన్న కథకాదు
బెస్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ – హెరిటేజ్‌-హిస్టరీ విభాగం – రజాకార్‌
నేషనల్‌ ఇంటెగ్రిటీ – సోషల్‌ అప్‌లిఫ్ట్‌ విభాగం – కమిటీ కుర్రాళ్లు
ఉత్తమ పుస్తకం – మన సినిమా ఫస్ట్‌ రీల్‌ (రెంటాల జయదేవ)

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌ – 2024
2014- 2023 ఉత్తమ చిత్రాలు

2014 బెస్ట్‌ ఫిల్మ్స్‌ – రన్‌ రాజా రన్‌ (ఫస్ట్‌), పాఠశాల (సెకండ్‌), అల్లుడు శీను (థర్డ్‌)
2015 బెస్ట్‌ ఫిల్మ్స్‌ – రుద్రమదేవి (ఫస్ట్‌), కంచె (సెకండ్‌), శ్రీమంతుడు (థర్డ్‌)
2016 బెస్ట్‌ ఫిల్మ్స్‌ – శతమానంభవతి (ఫస్ట్‌), పెళ్లిచూపులు (సెకండ్‌), జనతాగ్యారేజ్‌ (థర్డ్‌)
2017 బెస్ట్‌ ఫిల్మ్స్‌ – బాహుబలి 2 (ఫస్ట్‌), ఫిదా (సెకండ్‌), ఘాజీ (థర్డ్‌)
2018 బెస్ట్‌ ఫిల్మ్స్‌ – మహానటి (ఫస్ట్‌), రంగస్థలం (సెకండ్‌), కేరాఫ్‌ కంచరపాలెం (థర్డ్‌)
2019 బెస్ట్‌ ఫిల్మ్స్‌ – మహర్షి (ఫస్ట్‌), జెర్సీ (సెకండ్‌), మల్లేశం (థర్డ్‌)
2020 బెస్ట్‌ ఫిల్మ్స్‌ – అల వైకుంఠపురములో (ఫస్ట్‌), కలర్‌ ఫోటో (సెకండ్‌), మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ (థర్డ్‌)
2021 బెస్ట్‌ ఫిల్మ్స్‌ – ఆర్‌ఆర్‌ఆర్‌ (ఫస్ట్‌), అఖండ (సెకండ్‌), ఉప్పెన (థర్డ్‌)
2022 బెస్ట్‌ ఫిల్మ్స్‌ – సీతారామం (ఫస్ట్‌), కార్తికేయ 2 (సెకండ్‌), మేజర్‌ (థర్డ్‌)
2023 బెస్ట్‌ ఫిల్మ్స్‌ – బలగం (ఫస్ట్‌), హనుమాన్‌ (సెకండ్‌), భగవంత్‌ కేసరి (థర్డ్‌)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -