– జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షుడు స్వామి దాస్
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగులకు ఈనెల 18న ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షుడు స్వామిదాస్ ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షుడు స్వామిదాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగ శక్తిగా వికలాంగులకు బస్సులో ఉచితంగా టికెట్టు ఇస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ వికలాంగుల అభివృద్ధికి తోడ్పాటున అందించాలని ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ బస్సు ప్రయాణం ఉచితంగా కల్పిస్తున్నట్లే వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.





