- Advertisement -
హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల య్యాయి. ఎంపికైన అభ్య ర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్ 1 అంశంపై ఇప్పటికే కోర్టులో విచా రణ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గ్రూప్-1 నియామకాలు కొనసాగించవచ్చని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేయడంతో టీజీపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. ఒక పోస్టు ఫలితాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. గ్రూప్-1 ఫలితాల్లో లక్ష్మీదీపిక తొలి ర్యాంకు సాధించింది. మొత్తం 563 పోస్టులకు గాను 562 పోస్టులకు ఫలితాలు ప్రకటించింది. ఒక్క ఫలితాన్ని నిలిపేశారు.
- Advertisement -