- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణలో నేడు ఐసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ – 2025 ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ కానున్నాయి. జూన్ 8, 9వ తేదీలలో జరిగిన ఈ పరీక్షలకు 71, 757 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా… 64, 398 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు.
ఫలితాలను తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసి స్క్రీన్ పైన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఫలితాలు కనిపిస్తాయి. దీంతో విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
- Advertisement -