- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కశ్మీర్‌లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. దేశ రక్షణ కోసం సరిహద్దు రక్షణ దళం (బీఎస్ఎఫ్)లో చేరి, తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు యువకుడు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సంపంగి నాగరాజు (28) అనే యువకుడు, 2016 లో బీఎస్ఎఫ్ లో చేరి, మూడేళ్లుగా కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పని చేస్తున్నాడు నాగరాజు. మానసిక ఒత్తిడి కారణంగా మూడు రోజుల కిందట తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు నాగరాజు. మంగళవారం సొంత గ్రామానికి తీసుకొచ్చిన నాగరాజు మృతదేహాన్ని చూసి, గుండెలవిసేలా రోదించారు కుటుంబ సభ్యులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -