Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ 

తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
తెలంగాణ జర్నలిస్టుల దిక్సూచి అల్లం నారాయణ నాయకత్వం లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పురుడు పోసుకున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాలను జయప్రదం చేద్దామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్( హెచ్ 143) హనుమకొండ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి మస్కపురి సుధాకర్, అర్షం రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించి మే 31వ తేదీతో 25 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహిస్తున్న సంబరాల సభ గోడపత్రిక ను మంగళవారం పరకాల అమరదామం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధాకర్, రాజ్ కుమార్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను తెలియజేయడం కోసం మే 31న టీజేఎఫ్ రజతోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు.

తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు నినాదం తో 2001 మే 31న ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 2014 వరకు అన్ని వర్గాల ప్రజలను,ఉద్యమ సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజేఎఫ్ దని గుర్తు చేశారు. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాలకు హన్మకొండ జిల్లా నుండి జర్నలిస్ట్ లు అధిక సంఖ్యలో తరలివచ్చి విజవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ,వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పేరుమాండ్ల వెంకటేశ్వర్లు,జిల్లా కమిటీ నాయకులు బొమ్మగాని ఆదర్శ్ ,దొమ్మటి శ్రీకాంత్,పరకాల యూనియన్ నాయకులు పరకాల,శాయం పేట ,నడికూడా మండలాల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad