Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్పిరమల్‌ ఫైనాన్స్‌ కు తెలంగాణ మార్కెట్‌ కీలకం

పిరమల్‌ ఫైనాన్స్‌ కు తెలంగాణ మార్కెట్‌ కీలకం

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రముఖ బ్యాంకింగేతర విత్త సంస్థ పిరమిల్‌ ఫైనాన్స్‌ తమకు తెలంగాణ మార్కెట్‌ అత్యంత కీలకమని ఆ సంస్థ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ జగదీప్‌ మల్లారెడ్డి అన్నారు.. శుక్రవారం హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆ సంస్థ మార్కెటింగ్‌ హెడ్‌ అరవింద్‌ అయ్యర్‌ తో కలిసి మాట్లాడారు.
రాష్ట్రంలో రూ.5,200 కోట్ల రుణ పోర్ట్‌ఫోలియోతో బలమైన స్థానాన్ని కలిగి ఉన్నామన్నారు.ఇది కంపెనీ మొత్తం వ్యాపారంలో 10 శాతం వాటా అన్నారు. రాష్ట్రంలో 23 నగరాల్లో 29 బ్రాంచులతో 44,000 మంది కస్టమర్లకు సేవలు అందిస్తున్నామన్నారు. హౌమ్‌ లోన్స్‌, బిజినెస్‌ లోన్స్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఏఐ ఆధారిత సాధనాలతో నాన్‌ పెర్ఫార్మింగ్‌ లోన్లను 1 శాతం లోపు నియంత్రిస్తోంది. ‘సమీక్ష’ డిజిటల్‌ సిరీస్‌ ద్వారా కస్టమర్‌ కథలను పంచుకుంటూ ఎంగేజ్‌మెంట్‌ను పెంచుతోం దన్నారు. ”తెలంగాణలో మా రిటైల్‌ వ్యాపారం నిరంతర వృద్ధిని సాధిస్తోంది. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని, సరైన పరిష్కారాలను అందించడం ద్వారా దీర్ఘకాలిక సంబంధాలను నిర్మిస్తున్నాము. ‘సమీక్ష’ సిరీస్‌ ద్వారా కస్టమర్ల విజయ కథలను పంచుకుంటూ బ్రాండ్‌ కనెక్ట్‌ను బలోపేతం చేస్తున్నాం.” అని జగదీప్‌ మల్లారెడ్డి తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad