నవతెలంగాణ – దండేపల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పోస్టర్లను మండల విద్యాధికారి చిన్నయ్య, సెక్టోరియల్ అధికారి సత్యనారాయణమూర్తి ఉపాధ్యాయులతో కలిసి పోస్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అనేక కారణాల చేత పాఠశాల మానివేసిన విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు, అంగన్వాడీలు, వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పదవ తరగతి ఒకే సంవత్సరంలో ఇంటర్ విద్యను పూర్తి చేసుకోవచ్చని, ఈ సర్టిఫికెట్ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటుందని తెలియజేశారు. అడ్మిషన్ పొందడానికి ఈనెల 31 వరకు అవకాశం ఉందని వివరాలకు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ రాజేశ్వర్ ను 8309769067 సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ నాగేష్, సి సి ఓ మల్లేష్, సిఆర్పిలు నరసయ్య, రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పోస్టర్ ఆవిష్కరణ…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES