Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంరోడ్డు ప్రమాదాల్లో 8వ స్థానంలో తెలంగాణ

రోడ్డు ప్రమాదాల్లో 8వ స్థానంలో తెలంగాణ

- Advertisement -

– మరణాల్లో 10 వ స్థానం
– ‘రోడ్‌ యాక్సిడెంట్స్‌ ఇన్‌ ఇండియా – 2023’ నివేదికలో వెల్లడి
– మానవ తప్పిదాల వల్లే యాక్సిడెంట్లు…
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ 8వ స్థానంలో… రోడ్డు ప్రమాద మరణాల్లో 10 వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 22, 903 రోడ్డు ప్రమాదాలు జరగగా… ఈ యాక్సిడెంట్లలో 7,660 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం వెల్లడించింది. అయితే…. ఘోరమైన యాక్సిడెంట్ల ర్యాంకింగ్స్‌ లో తెలంగాణ 22 వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. 2022 తో పోల్చితే రాష్ట్రంలో సుమారు వెయ్యికి పైగా ప్రమాదాలు పెరిగినట్లు తెలిపింది. ఇదే సందర్బంలో దేశ వ్యాప్త ప్రమాదాల్లో తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్యం 4.8 గా, మరణాల్లో 4.4 గా నమోదు చేసినట్లు పేర్కొంది. అయితే మానవ తప్పిదాల వల్లే దేశంలో ప్రతియేటా రోడ్డు ప్రమాదాలు పెరగడానికి కారణమని వెల్లడించింది. ఇందులో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్లు, సీట్‌ బెల్ట్‌ లు వంటి భద్రతా పరికరాలు వాడకపోవడం వల్లే జరుగుతున్నాయని తెలిపింది. దేశంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి శుక్రవారం కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ‘రోడ్‌ యాక్సిడెంట్స్‌ ఇన్‌ ఇండియా – 2023’ రిపోర్ట్‌ ను విడుదల చేసింది. ఆ ఏడాది దేశ వ్యాప్తంగా 36 రాష్ట్రాలు/యూటీల్లో 4, 80, 583 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు వెల్లడించింది. ఇందులో 1, 72, 890 మంది చనిపోయినట్టు వెల్లడించింది. 2022 తో పోల్చితే 2023 లో రోడ్డు ప్రమాదాలు 4.2 శాతం పెరిగినట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో 18-45 ఏండ్ల మధ్య వయసు గల యువకులే 66.4 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. అయితే… దేశంలో అత్యధిక ప్రమాదాలు జరిగిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు(67,213) ఫస్ట్‌ ప్లేస్‌ లో ఉంది. 55,327 ప్రమాదాలతో మధ్య ప్రదేశ్‌, 48,091 యాక్సిడెంట్లతో కేరళ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే ప్రమాదాల్లో మరణాల పట్టికలో… 23, 652 మరణాలతో యూపీ మొదటి ప్లేస్‌ లో ఉండగా, 18, 347 మరణాలతో తమిళనాడు సెకండ్‌ ప్లేస్‌, 15, 365 మరణాలతో మహారాష్ట్ర థర్డ్‌ ప్లేస్‌ లో ఉన్నట్లు రిపోర్ట్‌ లో వెల్లడించింది. మరణాల్లో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు(45శాంత) ఉన్నారని, ఆ తర్వాతి స్థానంలో పాదాచారులు ఉన్నట్టు తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad