- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం వల్ల జగిత్యాలకు చెందిన రవీందర్ అనే వ్యక్తి మృతి చెందాడు. బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం అతడు ఇజ్రాయెల్ వెళ్లాడు. ఇరుదేశాల మధ్య భీకర దాడులు జరుగుతుండగా.. బాంబుల శబ్దం వల్ల రవీందర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సమాచారం కుటుంబసభ్యులకు చేరడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇరుదేశాల మధ్య భీకర యుద్ధం కారణంగా విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. రవీందర్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని అతడి కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
- Advertisement -