Friday, May 2, 2025
Homeసినిమా'హిట్‌3' సక్సెస్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది : దిల్‌ రాజు

‘హిట్‌3’ సక్సెస్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది : దిల్‌ రాజు

నేచురల్‌ స్టార్‌ నాని సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ HIT: The 3rd Case కేస్‌. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌ గా నటించింది. డాక్టర్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యూనానిమస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. హ్యుజ్‌ బజ్‌, ట్రెమండస్‌ బుకింగ్స్‌ తో మే 1న పాన్‌ ఇండియా గ్రాండ్‌ గా రిలీజ్‌ అయిన HIT: The 3rd Case అందరినీ ఆకట్టుకొని బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ని అందుకొంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. హీరో నాని మాట్లాడుతూ,’ఇది ఒక అద్భుతమైన రిలీజ్‌ డే. పొద్దున లేచి చూస్తే నా ఫోను మెసేజ్‌లతో నిండిపోయింది. ఇండిస్టీ, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ సినిమా గురించి అద్భుతంగా చెబుతున్నారు. సినిమా బుకింగ్స్‌ అదిరిపోయాయి.. సినిమా సూపర్‌ హిట్‌.. ఇవన్నీ పక్కన పెడితే ఇది జస్ట్‌ బిగినింగ్‌ ఆఫ్‌ ‘హిట్‌ 3′ జర్నీ. ఈరోజు నుంచి ప్రతి రోజు కూడా ఒక సెలబ్రేషన్‌లాగా ఉండబోతుంది. ఇది ఎక్కడికెళ్లి ల్యాండ్‌ అవుతుందనేది మా టీమ్‌ అంచనాలకి అందడం లేదు. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌ గొప్ప ఆనందాన్ని ఇచ్చింది’ అని తెలిపారు. ‘మే1న మళ్ళీ తెలుగు సినిమా ఇండిస్టీ బ్రీతింగ్‌ తీసుకుంది. లాస్ట్‌ మంత్‌ అంతా సినిమాలు వచ్చాయి. కానీ ఆడియన్స్‌ థియేటర్స్‌కి రావడం లేదు. సమ్మర్‌ అయిపోతుంది అనుకుంటున్న తరుణమిది. ఏప్రిల్‌ నెలలో సరైన సినిమాలు లేక చాలా సింగిల్‌ స్క్రీన్స్‌ ఏపీ, తెలంగాణలో క్లోజ్‌ చేయడం కూడా జరిగింది. ఇలాంటి సమయంలో మా హోప్స్‌ అన్నీ కూడా ఈ సినిమా మీదే ఉన్నాయి. ఆడియన్స్‌ సినిమాకి ఏ రేంజ్‌లో ఫుల్స్‌ ఇస్తారని బ్రీతింగ్‌ హోల్డ్‌ చేసుకుని ఉన్నాం. అలాంటిది ఈ సినిమాకి మూడు రోజులు ముందుగానే ఆన్‌లైన్‌ బుకింగ్‌ చూసి జనాలు థియేటర్స్‌కి వస్తున్నారని హ్యాపీగా ఫీలయ్యా. నానికి ఓవర్సీస్‌ ‘దసరా’ హయ్యస్ట్‌ ఉండేది. అది ఈ సినిమా క్రాస్‌ చేసింది’ అని నిర్మాత దిల్‌ రాజ్‌ చెప్పారు. డైరెక్టర్‌ శైలేష్‌ కొలను మాట్లాడుతూ,’సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌ చాలా ఆనందంగా అనిపించింది. నన్ను నమ్మిన నానికి థ్యాంక్స్‌. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img