Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్బ్రహ్మముడి సీరియల్ నటుడు మృతి

బ్రహ్మముడి సీరియల్ నటుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు, టీవీ ఆర్టిస్ట్ అల్లం గోపాలరావు(75) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం 8 గంటలకు తన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు, సినీ, టీవీ రంగాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు భార్య విమల, ఇద్దరు కుమారులు అనిల్, సునీల్ ఉన్నారు. పెద్ద కుమారుడు అనిల్ ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్నారు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గోపాలరావు భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు పలువురు సినీ, టీవీ ప్రముఖులు

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (ఎప్ఎన్సీసీ) మేనేజ్మెంట్ కమిటీ గోపాలరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో జరగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.





అల్లం గోపాల్ రావు సీరియల్స్..

అల్లం గోపాలరావు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో మినిస్టర్ పాత్రలో నటించారు, రిషికి , రిషి కుటుంబానికి అండగా ఉంటూ అన్ని విధాల ప్రోత్సహించే మంత్రి పాత్రలో ఈయన చాలా చక్కగా నటించారు. ఇకపోతే ఇటీవలే ఈ గుప్పెడంత మనసు సీరియల్ ముగిసిన విషయం తెలిసిందే. ఇందులోనే కాదు బ్రహ్మముడి సీరియల్ లో ఆయన జడ్జిగా కామెడీ పాత్ర చేశారు. అనామిక – కళ్యాణ్ విడాకుల కేసుకు సంబంధించిన ఎపిసోడ్లు న్యాయమూర్తిగా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad