- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జర్మనీలో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. తెలంగాణలోని జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్‌రెడ్డి.. ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లాడు. అక్కడ అతడు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో భవనం నుంచి కిందికి దూకేయడంతో హృతిక్‌రెడ్డి తలకు తీవ్ర గాయమైంది. ఈ క్రమంలో పరిస్థితి విషమించి మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



