నవతెలంగాణ-హైదరాబాద్: 11 సీజన్లుగా ఘన విజయాన్ని నమోదు చేసిన ప్రొ కబడ్డీ లీగ్, ఈసారి 2025 ఆగస్ట్ 29 నుంచి అక్టోబర్ 23 వరకు జరగనుంది. ఈ క్రమం లో తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 12 కోసం తమ కొత్త జట్టును ప్రకటించింది. మొత్తం 12 జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో ప్రతి జట్టు 18 లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్ 6 జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత పొందతాయి. ఈ సందర్భంగా తెలుగు టైటాన్స్ సీఈఓ డా. త్రినాధ్ రెడ్డి, మాట్లాడుతూ “వైజాగ్‌లో తెలుగు టైటాన్స్ అభిమానుల కోసం కబడ్డీ మళ్లీ మొదలవుతోంది.
భారతదేశం కబడ్డీకి ఎంతో కీలకమైన మార్కెట్. అన్ని ప్లాట్‌ఫామ్‌లపై అభిమానుల్ని చేరవేసే ప్రయత్నం మేము కొనసాగిస్తున్నాం. క్రీడ విలువను, ప్రేక్షకుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు మేము కమిట్‌మెంట్‌తో ముందుకు సాగుతున్నాం” అని అన్నారు.
అనంతరం తెలుగు టైటాన్స్ కోచ్ కృష్ణ కుమార్ హుడా మాట్లాడుతూ “కబడ్డీ అనేది అత్యంత ఉత్కంఠభరితమైన క్రీడ. సీజన్ 12లో మా జట్టు ఎన్నడూ లేనంత బలంగా ఉంది. ఈ సీజన్‌లో కొత్త స్ట్రాటజీలతో పాటు అభిమానులను ఆకట్టుకునే కొత్త మార్గాలను కనుగొంటాం. కెప్టెన్ విజయ్ మాలిక్‌తో కలిసి ఈ జోరును కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాం.
చివరిగా జట్టు కెప్టెన్ విజయ్ మాలిక్ మాట్లాడుతూ “ప్లేయర్లంతా సురక్షితంగా ఉన్నారని భావించాలి. వారిని ఆత్మవిశ్వాసంతో నింపాలి. వారు 100 శాతం ప్రతిభ చూపాలంటే, ముందు వారిని సురక్షితంగా అనిపించేలా చేయాలి. మాకు అనుభవం ఉన్నవారూ ఉన్నారు, కొత్తవారూ ఉన్నారు. కానీ ఒత్తిడి మాత్రం అందరికీ ఒకటే అని అన్నారు.
.