- Advertisement -
నవతెలంగాణ-గాంధారి: మండలంలో కరెంట్ షాక్‌తో ఓ కౌలు రైతు మృతి చెందాడు. ముదేల్లి గ్రామానికి చెందిన కర్రోల్ల సాయిలు వరి పొలానికి సాగునీరు పెట్టడానికి మోటర్ స్టార్టర్ ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టి మరణించాడు. మధ్యాహ్నా భోజనం తీసుకొని పొలం దగ్గరికి వెళ్లిన భార్య లలిత..గట్లపై విగతజీవిగా పడివున్న భర్త మృతదేహాన్ని గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -