- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్:ఆర్టీసీ బస్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ మాజీ మంత్రులు, BRS నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నేతలు అక్కడికి చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. హరీశ్‌రావు మెహదీపట్నం నుంచి బస్సులో బస్ భవన్‌కు వచ్చారు. రేతిఫైల్ బస్టాండ్ నుంచి కేటీఆర్, తలసాని, పద్మారావు చేరుకున్నారు. బస్సు ఛార్జీలు తగ్గించాలంటూ ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇవ్వనున్నారు.
- Advertisement -