Wednesday, April 1, 2026
E-PAPER
Homeజాతీయంమ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో సీఎం ఇంటి వ‌ద్ద ఉద్రిక్త‌త‌..లాఠీచార్జీ

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో సీఎం ఇంటి వ‌ద్ద ఉద్రిక్త‌త‌..లాఠీచార్జీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌ధ్య‌ప్ర‌దేశ్ భోపాల్‌లో ఉద్రిక్త‌త నెల‌కొంది. స్థానికంగా ఉన్న సీఎం నివాసం వైపు నిర‌స‌నకారులు ర్యాలీగా దూసుకొచ్చారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఆందోళ‌నకారుల‌ను బారికేడ్ల‌తో అడ్డుకున్నారు. అయినా ఆందోళ‌నకారులు సీఎం ఇంటి వైపు చొచ్చుకెళ్లేందుకు య‌త్నించ‌గా..వారిని నిలువారించ‌డానికి పోలీసులు లాఠీచార్జీ చేసి గుంపును చెద‌ర‌గొట్టారు. పూర్తి వివ‌రాలోకి వెళ్తే..

గ‌త ఆదివారం రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని అశోకా గార్డెన్ ప్రాంతంలో అర్ధరాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. దీంతో ఆగ్ర‌హించిన బాధితులు త‌మకు న్యాయం చేయాల‌ని, హంత‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని బాధితులు డిమాండ్ చేశారు. ఈ కేసులో పోలీసులు తీరును నిర‌సిస్తూ న్యాయం చేయాలంటూ భారీ సంఖ్య‌లో బాధితులు సీఎం నివాసం వైపు ర్యాలీగా దూసుకెళ్లారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఆందోళ‌న‌కారుల‌పై లాఠీచార్జీ చేశారు. పోలీసుల తీరును బాధితులు తీవ్రంగా ఖండించారు. తాము శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతుంటే..అన్యాయంగా త‌మను కొట్టార‌ని బాధితులు వాపోతున్నారు.

అయితే..స‌దురు యువ‌కుని హ‌త్య కేసులో ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశామ‌ని,మిగిలిన ఒక నిందితుడిని కూడా అతి త్వరలో ప‌ట్టుకుంటామ‌ని, గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశామ‌ని ఉన్న‌తాధికారులు చెప్తుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -