Thursday, December 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగాంధీభవన్‌ వద్ద ఉద్రిక్త‌త‌

గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్త‌త‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలంగాణలో బీజేపీ కార్యాలయాల వద్ద ఉ‍ద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్‌ శ్రేణులు యత్నించాయి. గాంధీభవన్‌ వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీస్‌ ముట్టడికి కాంగ్రెస్‌ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. బీజేపీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తోందని ఆందోళన చేపట్టారు. దీంతో గాంధీభవన్ మెట్రో స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఇన్నో వాలో వచ్చారు.. బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు.. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బారికేడ్ లకు ఇటువైపు బీజేపీ కార్యకర్తలు నిలబడ్డారు.. బీజేపీ నేతల చేతిలో కర్రలు ఉండటం ఉద్రిక్తతకు దారి తీసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -