Thursday, April 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎల్బీనగర్‌ చౌరస్తాలో ఉద్రిక్తత..

ఎల్బీనగర్‌ చౌరస్తాలో ఉద్రిక్తత..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉగాది పండగ వేళ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ చౌరస్తా ఉద్రిక్తతలకు వేదికైంది. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ పార్టీ ఘటన నేపథ్యంలో ఎల్బీనగర్‌లో ‘సే నో డ్రగ్స్‌ ఛాలెంజ్‌’ ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్‌ నేతలకు ఎల్బీనగర్‌ బీఆర్‌ఎస్‌ నేతలు ‘వైట్‌ ఛాలెంజ్‌’ విసిరారు. బీఆర్‌ఎస్‌ నేతల ఛాలెంజ్‌ స్వీకరించి కాంగ్రెస్‌ నేతలు ఎల్బీనగర్‌కు చేరుకున్నారు. అక్కడి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇతర నేతలు ఎల్బీనగర్‌ చౌరస్తాకు వెళ్లారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -