- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: థాయ్‌లాండ్, కంబోడియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల సరిహద్దు వెంబడి అనేక ప్రాంతాల్లో రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలలో ఓ సైనికుడితో పాటు 15 మంది మృతి చెందారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఈ మేరకు భారతీయుల కోసం థాయ్‌లాండ్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టింది. భారత పౌరులు థాయ్‌లోని ఏడు ప్రావిన్స్‌లవైపు ప్రయాణించొద్దని తెలిపింది. ఉబోన్ రాట్చథాని, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కాయో, చంతబురి, ట్రూట్.. ఈ ఏడు ప్రావిన్స్‌లకు దూరంగా ఉండాలని సూచించింది.
- Advertisement -