నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఆ రాష్ట్ర సీఎం ఇంటి ముట్టడికి యత్నించిన టీచర్ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ చేపట్టారు. ఆందోళకారులను బలవంతంగా ఈడ్చి వ్యాన్‌లో పడేశారు. నిరసనలో పాల్గొన్న మహిళా అభ్యర్థులపై కూడా పోలీసులు లాఠీచార్జీ చేశారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీచర్ ఉద్యోగులను భర్తీ చేయడానికి.. 87,774 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో 66,000 పోస్టులకు మాత్రమే రిజల్ట్ విడుదల చేసింది. ఇంకా మిగిలిన 21,000 పోస్టుల ఫలితాలు విడుదల చేయాలని పాట్నాలో 50రోజులుగా ఆందోళనకారులు నిరసన దీక్ష చేపట్టినా ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందనలేకపోవడంతో.. తాజాగా మంళవారం సీఎం నితిన్ ఇంటి ముట్టడికి నిరసనకారులు పిలుపునిచ్చారు. దీంతో భారీయోత్తున ర్యాలీగా బయలుదేరి..సీఎం ఇంటి ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీస్ బలగాలు..నిరసన కారులను నిలువరించే ప్రయత్నం చేశాయి. కానీ పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీలకు పోలీసులు పని చెప్పారు. ఆందోళనకారులపై లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకొని స్థానిక పీఎస్‌కు తరలించారు అధికారులు.
బీహార్‌లో ఉద్రిక్తత..
- Advertisement -
- Advertisement -