నవతెలంగాణ-హైదరాబాద్: డబుల్ ఇంజన్.. ధోకేబాజ్ సర్కార్: రాహుల్ గాంధీ
నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ లో శిక్ష న్యాయ్ సంవాద్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం దర్భంగాలోని అబేంద్కర్ హాస్టల్ విద్యార్థులతో సమావేశమవుడానికి రాహుల్ గాంధీ బయలుదేరారు. ఈ భేటీకి ముందస్తు అనుమతులు లేవని రాహుల్ గాంధీ కారును రోడ్డుపైనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వెంటనే పార్టీశ్రేణుల ఆందోళనతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత దర్బాంగలోని ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేరుతో నితిష్ కుమార్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విలువలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి డబుల్ ఇంజన్ ధోకేబాజ్ సర్కార్ అని ఆయన ఎద్దేవా చేశారు. మైనార్టీ, దళితులను కలువనీయకుండా, వారి సమస్యలపై గళం విప్పకుండా తనను నితిష్ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు. పీఎం మోడీ ప్రకటించిన కులగణన బహుజనుల ఒత్తిడి ఫలితమేనని, కానీ వారి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి మైనారిటీలకు వ్యతిరేకమన్నారు. ఇది అదానీ-అంబానీ ప్రభుత్వం అని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహర్ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా చివరి నిమిషంలో అనుమతిని రద్దు చేశారని ఆపార్టీ నేతలు ఆరోపించారు. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేపట్టారు.