- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ బోరబండలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ వర్గానికి చెందిన ఓ హిజ్రా కేసుల పేరిట వేధిస్తోందంటూ కొంతమంది హిజ్రాలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఆవేశానికి లోనైనా ఓ హిజ్రా ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ముగ్గురు హిజ్రాలతో పాటు పోలీసులకూ గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -



