నవతెలంగాణ-హైదరాబాద్: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ముందు సహస్ర తల్లిదండ్రులు, ఎస్సీ ఎస్టీ సంఘాలు ఆందోళనకు దిగాయి. సహస్రకి న్యాయం జరిపించాలంటూ డిమాండ్ చేశారు. తన కూతురికి జరిగినట్టుగా ఆ అబ్బాయికి జరగాలని సహస్ర తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కూతురుని కోల్పోయిన తమ బాధ ఆ అబ్బాయి తల్లిదండ్రులకు తెలియాలని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర రాజధానిలో బాలిక సహస్ర హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇంటిపక్కన ఉండే పదో తరగతి చదువుతున్న బాలుడు క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకు వచ్చి సహస్ర కంటపడడంతో, విషయం బయటకు చెబుతుందేమోనని ఆందోళన చెంది తనతో తెచ్చుకున్న కత్తితో బాలిక గొంతులో పొడిచి అతి కిరాతకంగా అంతమొందించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్ కు తరలించారు.